నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాసిల్దార్ కార్యాలయంలో ఆర్మూరు మండల రేషన్ షాప్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశంలో మండలంలోని రేషన్ కార్డు దారుల యొక్క ఈ కేవైసీ 72% పూర్తయిందని ఈ నెల ఆఖరి వరకు మొత్తం కార్డుల కేవైసీ పూర్తి చేయాలని రేషన్ షాప్ ల వారీగా విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రతి నెల సమావేశం నిర్వహించాలని. నాయబ్ తాసిల్దార్ రేషన్ షాప్ డీలర్లకు తెలిపారు. ఇట్టి సమావేశంలో నయాబ్ తాసిల్దార్ విజయ్ కాంత్ రావు, మండల గిరిధావర్ అశోక్ సింగ్, జూనియర్ సహాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.