నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లిలో అనంత ఆంజనేయ స్వామి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రారంభించారు.
ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్ వర్కింగ్ అధ్యక్షుడు, జాతీయస్థాయి కార్యవర్గ సభ్యులు భూమన హాజరైనారు. ఆయన ఇట్టి కార్యక్రమంలో మాట్లాడుతూ 60 సంవత్సరాలు పూర్తి అయిన వారు కుల మత వర్గ విభేదాలు లేకుండ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వయా వృద్ధులకు కుటుంబంలో ప్రాధాన్యత ఇవ్వకుండా వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన చట్ట ప్రకారం గా తగు చర్యలు తీసుకోబడునని ప్రతి ఒక్కరికి డబ్బు ముఖ్యం కాదని మానసిక ఉల్లాసం సేవ భావం కలిగి ఉండాలని భూమన్న చెప్పారు. వృద్ధులకు సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పాఠశాలలో పేద విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ బీదవృద్ధులకు చేతి కర్రలు, ఆరోగ్యపరంగా హెల్త్ క్యాంపులు నిజాంబాద్ వమౌ వృద్ధుల సంక్షేమ సంఘం ద్వారా ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రాజిరెడ్డి తెలిపారు. ఇట్టి సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి విజయ్ కుమార్, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆర్మూర్ శాఖ అధ్యక్షులు వర్మ, కోమన్ పల్లి సీనియర్ సిటిజన్ అధ్యక్షులు బండి సాయన్న, ఇస్సపల్లి సీనియర్ సిటిజన్ అధ్యక్షులు నారాయణ, మామిడిపల్లి కౌన్సిలర్ రవి గౌడ్, కాశిరాం తదితరులు పాల్గొన్నారు. వయోవృధులకు సంక్షేమానికి 21000 రూపాయలు నగదును ఆర్థిక సాయం చేసి తన సేవా భావాన్ని చాటుకున్నారని. మరికొందరు కూడా ఆర్థిక సాయం అందించారని వారు తెలిపారు. మామిడిపల్లి లో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కార్యవర్గ కమిటీ ప్రకటించారు. అధ్యక్షునిగా మల్యాలపోశెట్టి, ఉపాధ్యక్షుడుగా పవన్ రెడ్డి, ప్రధానకార్యదర్శిగా నడిపి మ ల్లయ్య, సంయుక్త కార్యదర్శిగా బి సాయిలు, కోశాధికారిగా లక్కారం పోశెట్టి.