నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :
జక్రాన్ పల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి గౌరవ శ్రీ దామోదర్ రాజనర్సింహ గారికి భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధికార ప్రతినిధి బుస్సాపూర్ శంకర్ స్వాగతం పలికారు .
ఆర్ముర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ
గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోకుండా , పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్న పరిస్థితిలో పైపుల రాజా రెడ్డి గారు మూడు కోట్ల రూపాయలు సేకరించి సొంత గ్రామంలో పాఠశాలను ప్రారంభించడం గొప్ప విషయం అన్నారు.
ఎన్నో స్వచ్చంద సేవ కార్యక్రమాలు చేస్తున్న పైపులా రాజారెడ్డి గారిని మరియు పీ డీ ఉమా మహేశ్వర రెడ్డి గార్లను సన్మానించారు.