నిజామాబాద్ జిల్లా a9న్యూస్ :
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినిత పవన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ముగిసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాలతో నిర్వహించిన బల నిరూపణ సమావేశం. సమావేశానికి హాజరైన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, అసమ్మతి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన 20 మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు, 4గురు బిజెపి కౌన్సిలర్లు, అవిశ్వాస సమావేశానికి హాజరైన కోరం సభ్యులు 20 టిఆర్ఎస్ కౌన్సిలర్లు, 4 బిజెపి కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో1ఎమ్మెల్యే మొత్తం 25 మంది కోరం. సమావేశానికి హాజరైన ప్రత్యేక అధికారి ఆర్డిఓ వినోద్ కుమార్. అవిశ్వాసం బల పరీక్ష లో నెగ్గిన కోరం సభ్యులు. మొత్తానికి పాత చైర్ పర్సన్ ను పదవి నుంచి తొలగించిన అవిశ్వాస పెట్టిన కౌన్సిలర్లు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎసిపి జగ్రిష్ చందర్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చవాన్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అవిశ్వాసం నెగ్గిందని, అవినీతిపై విజయం సాధించామని అన్నారు. తాను రాజకీయంలోకి అడిగిన తర్వాత రెండో వికెట్ పడ్డదన్నారు. ఆర్మూర్ ప్రజలు కోరుకుంటున్నట్టు అవినీతిని అంతం చేసి ఆర్మూర్ ప్రజల అభివృద్ధికై నూతన ఓరవడి ప్రారంభమైందన్నారు. మీ పార్టీ నుండి చైర్మన్ పదవికి పోటీలో ఉన్నారా అని అడగగా చైర్మన్ పదవులు వాటంతట అవే వస్తాయని అన్నారు. అవిశ్వాసానికి ప్రత్యేక అధికారిగా వ్యవహరించిన ఆర్మూర్ ఆర్డీవో టీ. వినోద్ కుమర్ మాట్లాడుతూ 19 మంది బిఆర్ఎస్ కౌన్సిలర్స్, ఒకరు ఎంఐఎం కౌన్సిలర్, నలుగురు బిజెపి కౌన్సిలర్లు, ఒక ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియల్ గా ఓటు వేయగా మొత్తం 25 మంది అవిశ్వాసానికి పూర్తి మద్దతు ప్రకటించి అవిశ్వాసాన్ని నెగ్గారు అన్నారు. జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించి తదుపరి కార్యాచరణ, కొత్త చైర్మన్ పదవి ఎన్నిక వాటిపై నిర్ణయాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన నిర్ణయం మేరకు కొత్త చైర్మన్ ఎన్నిక జరుగుతుందన్నారు.