వ్యవసాయ శాఖ అధికారి రజిత వెల్లడి.
ఎ9 న్యూస్ మాసాయిపేట మెదక్ ఆగస్టు 11
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రైతు వేదిక కార్యాలయంలో రైతులు *05-06-2025* నాటికి భూభారతి పోర్టల్‌లో డిజిటల్ సైన్ చేసిన పట్టాదారుల వివరాలు మరియు కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ నుండి అందిన ROFR పట్టు హోల్డర్ల వివరాలు ఆధారంగా పాత/కొత్త అర్హులైన రైతుల బీమా పునరుద్ధరణ/నమోదు జరుగుతుంది.
18 నుండి 59 సంవత్సరాల వయస్సు (పుట్టిన తేదీ 14-08-1966 నుండి 14-08-2007 వరకు) ఉన్నవారు మాత్రమే అర్హులు.
నమోదు కోసం రైతు తప్పక ఈ పత్రాలు ఒరిజినల్ మరియు జీరాక్స్ కాపీలను తీసుకురావాలి.
1. రైతు ఆధార్ కార్డు,
2. భూమి పట్టా పాస్‌బుక్,
3. నామినీ ఆధార్ కార్డు,
4. రైతు బీమా Enrollment ఫామ్.
రైతు తప్పక హాజరు కావలెను.(వాట్సప్ ద్వారా కానీ ఇతర వ్యక్తుల ద్వారా డాక్యుమెంట్ పంపుతాము మేము చాలా దూరంలో ఉన్నాము ఇంత తక్కువ సమయంలో మేము రాలేము అని దయచేసి భీమ చేయండి అని అడగొద్దు రైతు తప్పక వొచ్చి సంతకం చేయాలి.)
భూమి కలిగి ఇంకా రైతు బీమా చేసుకొని రైతులు చేసుకోగలరని ,
వ్యవసాయ విస్తరణ అధికారి రజిత తెలిపారు







