A9 న్యూస్ ఫ్లాష్ ఫ్లాష్:
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం పై దేశ వ్యాప్తంగా ఉన్న ట్రక్ డైవర్లు నిన్నటి నుంచి ధర్నాలు చేస్తున్నారు. దీంతో ఆయిల్, పెట్రోల్, డీజిల్ కొరత భారీగా ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో అయితే ఉదయం నుంచే బంకుల వద్ద వాహనదారులు భారీగా లైన్ కట్టారు. కొన్ని ప్రాంతాల్లో అయితే బంకులు స్టాక్ లేదని మూసేశారు. దీంతో ఉదయం నుంచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ఈ రోజు సాయంత్రం ట్రక్ డ్రైవర్‌లు చేస్తున్న నిరసనను విరమించుకున్నారు. వెంటనే తమ ట్యాంకర్లతో డ్రైవర్‌లు ఆయిల్ కంపెనీలకు బయలు దేరారు. డ్రైవర్‌లు నిర్ణయంతో రేపు ఉదయం నుంచి యధావిధిగా పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి రానుంది. ఉదయం నుంచి బంకుల వద్ద ఇబ్బందులు పడిన వాహనదారులకు ఈ న్యూస్ కాస్త ఉపశమనాన్ని కలిగించనుంది.