నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :
*🔊త్వరలో మెగా డీఎస్సీ*
*🔶సత్వరమే ఉపాధ్యాయ ఖాళీల భర్తీ*
*🔷బడిలేని ఊరు ఉండొద్దు*
*🔶మూసివేసిన వాటినీ తెరిపించాలి*
*🔷‘మన ఊరు-మనబడి’ నిధుల వినియోగంపై విచారణ*
*🔶ఉమ్మడి జిల్లాల్లో నైపుణ్య వర్సిటీలు*
*🔷విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి*
హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి వీలుగా త్వరలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అందుకు అనుగుణంగా వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ప్రతి పంచాయతీ పరిధిలో పాఠశాల ఉండాలని, కుగ్రామాలు, మారుమూల తండాల్లోనూ ప్రభుత్వ బడి ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. ఉపాధ్యాయులు లేరనే కారణంతో మూసివేసిన బడులను వెంటనే తెరిపించాలని ఆదేశాలు ఇచ్చారు. త్వరలో ఉపాధి ఆధారిత విద్యా శిక్షణ కోసం పది ఉమ్మడి జిల్లాల్లో నైపుణ్య విశ్వవిద్యాలయాల (స్కిల్ యూనివర్సిటీలు)ను నెలకొల్పుతామని ప్రకటించారు. విద్యాశాఖ, ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై శనివారం ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. అనంతరం సీఎం మాట్లాడారు. ‘‘ప్రతి ఒక్కరికీ విద్య అందాలనేదే ప్రభుత్వ లక్ష్యం. ఏ ఒక్కరూ చదువు కోసం ఇతర గ్రామాలకు, పట్టణాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదు. ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే. ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు వెంటనే డీఎస్సీ నిర్వహిస్తాం. తద్వారా ఖాళీలు భర్తీచేస్తాం’’ అని సీఎం అన్నారు. సర్వ శిక్ష అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) నిధులతో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద ఇప్పటిదాకా చేసిన ఖర్చులు, అందుకు అనుగుణంగా పనులు జరిగాయా, లేదా అనే విషయమై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకంలో మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తిచేసి, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఉత్తమంగా తీర్చిదిద్దాలని మార్గదర్శనం చేశారు.*
*💥పదోన్నతులు, బదిలీల ప్రక్రియపై దృష్టి పెట్టండి*
*🌀ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో ఉన్న అవాంతరాలపై అధికారులు దృష్టిసారించాలని సీఎం సూచించారు. వాటిని అధిగమించడానికి అనుసరించాల్సిన మార్గాలపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలన్నారు. ప్రత్యామ్నాయ పద్ధతులనూ అన్వేషించాలన్నారు. ‘‘ప్రభుత్వ విద్యాలయాలకు విద్యుత్తు బిల్లులు అధికంగా వస్తున్న నేపథ్యంలో కనెక్షన్ల కేటగిరీ మార్పునకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. వ్యాపార, పారిశ్రామిక కేటగిరీ కింద బిల్లులు వసూలు చేయకుండా ప్రత్యామ్నాయాలు అన్వేషించాలి. పాఠశాలల్లో అవసరమైన మేరకు స్వీపర్లు, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలి.*
*💥నైపుణ్యం పెంపొందించేలా…*
*💠రాష్ట్రంలోని యువత పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన నైపుణ్యం సాధించేలా, ఆయా ఉద్యోగాలకు పోటీపడేలా నైపుణ్య విశ్వవిద్యాలయాలు నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో కొడంగల్ నియోజకవర్గంతోపాటు మిగిలిన తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోనూ వీటిని ఏర్పాటుచేయాలి. ఉపాధి కల్పన లక్ష్యంగా స్వల్ప, దీర్ఘకాల కోర్సులను వాటిలో ప్రవేశపెట్టాలి. ఈ విషయంలో గుజరాత్, హరియాణా, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని నైపుణ్య కేంద్రాల పనితీరును అధ్యయనం చేయాలి. దీని కోసం విద్య, పరిశ్రమలు, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీవేసి ప్రతిపాదనలను సమర్పించాలి’’ అని సీఎం ఆదేశించారు. సమీక్ష సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, సీఎంవో అధికారులు శేషాద్రి, షా-నవాజ్ కాసీం తదితర అధికారులు హాజరయ్యారు.