నిజామాబాద్ A9 న్యూస్:
సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సిపిఎం జిల్లా విస్తృత సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 6 గ్యారంటీల అమలు కోసం ప్రజలతో దరఖాస్తులను స్వీకరించటానికి ప్రజా పాలన కార్యక్రమం ద్వారా అధికారులను పట్టణాలు గ్రామాల్లో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని గత దశాబ్ద కాలంగా ప్రజలు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు సమస్యల పైన అనేకమార్లు గత ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నప్పటికీ పరిష్కారం కాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న దరఖాస్తులను అర్హుల అందరి చేత పెట్టించి వాటిని అమలు జరపటానికి పార్టీ కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం అయోధ్యలో రామాలయం పేరుతో 20వ తారీకు నాడు విస్తృతంగా ప్రజల్లో చర్చను జరిపి రాజకీయ ప్రయోజనాలను పొందాలని చూస్తున్నారని గత దశాబ్ద కాలంగా ఉపాధి పెంచటంలో కానీ రైతులు మహిళల సమస్యల పరిష్కారంలో కానీ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి రామాలయం నిర్మాణం అంశాన్ని ముందుకు తీసుకొచ్చారని ఈ పేరుతో మత రెచ్చగొట్టి తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, వెంకటేష్, శంకర్ గౌడ్ జిల్లా కమిటీ సభ్యులు వై.గంగాధర్, నన్నే సబ్, సూరి, జే గంగాధర్ లతోపాటు వివిధ మండల కార్యకర్తలు పాల్గొన్నారు.