జర్నలిస్ట్ , జిత్తు భాయ్…
మీ శ్వేత పత్రం పై ప్రశ్నలుమీ స్వేద పత్రంపై మా శ్వేతపత్రం
———————————————-
*కేటీఆర్ గారూ! 2014 కు ముందు మీ ఆస్తులు ఎన్ని ఇప్పుడు మీ ఆస్తులు ఎన్ని మీ స్వేదపత్రంతో జతకలిపి ప్రకటిస్తే బాగుంటుంది.
*మీ కుటుంబంలోని అందరూ పదవులు అనుభవించడంతో పాటు తీసుకున్న జీతాలు, భత్యాలు, సౌకర్యాల విలువపై కూడా ప్రకటన చేయాలి.
*మీ ఫార్మ్ హౌజ్ లు, విల్లాలు, విలువైన వస్తువుల పై ప్రకటన చేయాలి.
*మీ పార్టీ ఆఫీసుల కోసం కూడబెట్టిన భూముల విలువ ఎంతో? ఆఫీసుల బిల్డింగ్లు కట్టడానికి చేసిన వ్యయం ఎంతో? ప్రకటన చేయాలి.
*కొత్త జిల్లాలతో పాటుగా అవసరం లేకున్నా పాత జిల్లాలలోని కలెక్టరేట్ బల్డింగ్స్ను కూడా కూలగొట్టి కొత్తగా కట్టారు. కొత్త కలెక్టరేట్ల చుట్టూ మీ కుటుంబ సభ్యులు, బందువులు, మీ పార్టీ నేతలు భూములు కూడబెట్టి కాదు కాదు కొల్లగొట్టి కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. వాటిపై కూడా “స్వేద పత్రం” వేయాలి సర్.
*ఔటర్ రింగు రోడ్డు 30 ఏళ్ళ లీజ్ వ్యవహారం పై బహిరంగ ప్రకటన చేస్తే బాగుంటది కేటీఆర్ గారు!
*మీ పార్టీ దేశంలోనే క్షమించండి ప్రపంచంలోనే అత్యంత (బీజేపీ తర్వాత లెండి) సంపన్నమైన రాజకీయ పార్టీ. ఏ ప్రాంతీయ పార్టీ కూడా మీ పార్టీ అంత సంపన్నమైన పార్టీ కాదు. అదీ పది సంవత్సరాలలో మీకు సాధ్యమైంది. అరవై ఏళ్ల నుంచి వున్న ద్రవిడ పార్టీలకు కానీ నలభై ఏళ్ల నుంచి వున్న తెలుగుదేశం పార్టీ కి కానీ అది సాధ్యం కాలేదు. ఆ రహస్యంపై కూడా స్వేద పత్రం వేయాలి చిన్న దొర గారూ!
*మీ పార్టీకి సొంత విమానమే వుంది. దేశంలో మరే పార్టీకి లేదనుకుంటా సుమీ! అదెలానో చెబుతారా సార్!
*మీ నాయకులందరి ఆస్తులపై కూడా శ్వేతపత్రం వేస్తే ప్రజలందరూ సంతోషిస్తారు ట్విట్టర్ కింగ్ గారు.
*మీరు ఏమి చేసినా ప్రజలందరూ మెచ్చుకుంటారు సార్. మీరు వందల luxury కార్ల కాన్వాయ్ తో మహారాష్ట్రకు దండయాత్ర మాదిరిగా వెళ్ళినప్పుడు ప్రజలందరూ నివ్వెరపోయారు సార్. దానికి ఎంత ఖర్చు పెట్టారో దొర గారూ! సెలవిస్తారా?
H.No:3-36/1
Indalwai station NH 44
main service road near union Bank
district nizamabad, Telangana India.
9440038547