Aug 08, 2025,
బీజేపీ సర్కార్ రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రకరకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పుడు రైతులు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండానే నెలకు రూ.3000, ఏడాదికి రూ.36000 పెన్షన్ పొందవచ్చు. ప్రధాన మంత్రి కిసాన్ మందన్ యోజనని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో అనుసంధానించింది. ఈ పథకం కింద రైతులకు నెలకు రూ. 3,000 లేదా వృద్ధాప్యంలో ఏడాదికి రూ.36,000 స్థిర పెన్షన్ లభిస్తుంది.