నిజామాబాద్ A9 న్యూస్:
భారత వ్యవసాయ రంగాన్ని బలిపీఠంపై నిలబెట్టిన కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ బలమైన రైతాంగ ఉద్యమం తీసుకురావాల్సిన అవసరం ఉందని, అఖిల భారత రైతుకులి సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. సోమవారం ఆర్మూర్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం భీమ్గల్ మండల కేంద్రంలో డివిజన్ కార్యదర్శి పిట్ల కారల్ మార్క్స్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశానికి హాజరైన భూమయ్య మాట్లాడుతూ పుట్టెడు కష్టాలలో భూమినె నమ్మిన రైతులు అప్పులు చేసి పంటలు పండిస్తే పంటలకు గిట్టుబాటు ధర రాక అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలకు గురవుతున్నారని, ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో తెచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా బలమైన రైతాంగ ఉద్యమం ఫలితంగా మోడీ ప్రభుత్వం వాటిని విత్డ్రా చేసుకుందని, ఆ సందర్భంగా రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు అన్నారు. ఎంపీ ఎస్ పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకొస్తామని రైతులపై మోపిన తప్పుడు కేసులను ఎత్తివేస్తామని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకుంటామని, మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయక రైతాంగాన్ని మోసం చేసిందని, ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా దేశం లోని భూములను కార్పోరేట్ సంస్థలకు ఆదాని అంబానీలకు అప్పజెప్పి రైతులను భూముల నుండి బేకతలు చేసేందుకు ప్రయత్నిస్తుందని, రైతుల చారిత్రక ఉద్యమం ముందు వారి ఆగడాలు సాగవని, ఆయన అన్నారు.
ఇప్పటికైనా ఎమ్మెస్పీ మద్దతు ధరల చట్టాన్ని తీసుకురావాలని, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, రైతులపై మోపబడిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని, రైతుల అప్పులను మాఫీ చేసి రుణ విముక్తుల్ని చేయాలని, కొత్త రుణాలు అందజేసి రైతులను ఆదుకోవాలని, డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను, అమలుతోపాటు రైతుల సమస్యలను పరిష్కరించాలని, వారు కోరారు.
ఈ సమావేశంలో ఏ కె ఎం ఎస్ డివిజన్ కార్యదర్శి పి కారల్ మార్క్స్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్ భూములకు పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తామని, గవర్నర్ చె స్వయంగా ప్రకటన చేయడం చాలా హర్షించదగ్గ విషయమని, ఆయన అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే పోడు రైతులని విస్మరిస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందని, ఇకనైనా పోడు రైతులకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని ,వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు, నిరుపేదలకు భూమి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినట్లుగా ప్రతి దళితుడికి గిరిజన బిడ్డకు సొంత ఇంటి కల నెరవేర్చుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అది అట్టడుగు వర్గాలకు అందే విధంగా ,కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి రెడ్డి, కృష్ణ గౌడ్, నాయకులు, గులాబ్ హుస్సేన్, దేవదాస్, షావుకారి, లింబాద్రి, నరస గౌడ్, జాకీర్, గంగారాం, ధర్మపురి, మల్కి, సంజీవ్, గంగన్న తదితరులు పాల్గొన్నారు.