Tuesday, November 26, 2024

ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రజలు

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ లోని భారతీయ జనతా పార్టీ క్యాంపు కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ నిర్వహించి నటువంటి పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతు….

ఆర్మూర్ అసెంబ్లీ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటు వంటి లోకల్ వ్యక్తి అదే విధంగా బిజెపి వ్యక్తి ఎమ్మెల్యే కావడం ఆర్మూర్ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారని. లోకల్ వ్యక్తి, శాసన సభ్యునిగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన వ్యక్తి అయిన పైడి రాకేష్ రెడ్డి ని ఆర్మూర్ నియోజక ప్రజలు ఎన్నికలలో 30 వేల మెజార్టీతో గెలిపించడాన్ని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తుంది.
అదేవిధంగా నిన్నటి రోజు శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన పైడి రాకేష్ రెడ్డి కి భారతీయ జనతా పార్టీ తరఫున శుభాభినందనలు తెలియజేయడమైనది.

2019 ఆగస్టు 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లో ఉన్న స్వయం ప్రతిపత్తి ఇచ్చే రాజ్యాంగం లోని 370 వ మరియు 35 ఏ అధికారనను రద్దు చేస్తూ తీర్మానించడం జరిగింది. ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లడం…మొన్నటికి మొన్న సర్వోన్నత న్యాయస్థానం జమ్ము కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని ఇచ్చే రాజ్యాంగంలోని 370 అధికరణాలను రద్దుచేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన నోటిఫికేషన్ రాజ్యాంగబద్ధమేనని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం వెలువరించిన తీర్పును భారతీయ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేస్తా ఉంది. ఎందుకంటే “ఒకే భారతం – శ్రేష్ట భారతం” స్ఫూర్తితో మరింత బలోపేతమైనటువంటి దిశగా అడుగులు వేయడమే దీని యొక్క ఉద్దేశం. అంతేకాకుండా ఆర్టికల్ 370,35 ఏ రద్దు తో “ఆఫ్సాన్ ఆపిక్” అనే ఈమె, భారత సైనికుల పైన, పోలీసుల పైన, అధికారుల పైన రాళ్లు విసిరే అల్లరి మూకలో ఉన్న ఈమె భారత ప్రభుత్వ సముచిత చర్యల కారణంగా, ప్రోత్సాహం కారణంగా ఫుట్బాల్ జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు సంపాదించగలిగింది. ఇలాంటి ఉదాహరణలు, ఈ రోజు జమ్ము కాశ్మీర్లో ఎన్నో కావున దేశ ప్రజలు ఈ తీర్పును స్వాగతిస్తా ఉన్నారు.

ఇక ఆర్మూర్ నియోజకవర్గ విషయానికి వస్తే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన జీవన్ రెడ్డి యొక్క అవినీతి, అక్రమ భాగోతాలు ఆర్మూర్ నియోజకవర్గంలో కోకొల్లలు. పేదవాళ్లు ఒక నెల కరెంట్ బిల్లు కట్టక పోతే వెంటనే కరెంటు సప్లై ను ఆపేసే విద్యుత్ అధికారులు, ఆర్టీసీ మడిగిలలో కిరాయికి ఉండే అద్దె దారులు ఒక నెల బాడుగ కట్టనట్లయితే బెదిరించే అధికారులు మరి గత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విద్యుత్ బకాయిలు రెండున్నర కోట్ల వరకు ఉన్న, ఆర్టీసీ కాంప్లెక్స్ కు సంబంధించి దాదాపు ఏడున్నర కోట్లు బకాయిలు ఉన్న అడగకపోవడం ఎంతవరకు సమంజసమని, పేదవారికో న్యాయం అధికారంలో ఉన్నవారికి ఇంకో న్యాయమా అని బిజెపి ప్రశ్నిస్తా ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ వ్యక్తిగతమైనటువంటి రుణాలు ఎవరికి ఇవ్వదు. కానీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ 20 కోట్ల రుణాన్ని ఇవ్వడం ఆ రుణం వడ్డీతో పాటు 45 కోట్లకు చేరడం తాను ఒక రూపాయి కట్టకపోయినా చోద్యం చూడడం ఎంతవరకు సమంజసం. గత రాష్ట్ర ప్రభుత్వం లో ఉన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో కోటానుకోట్ల రూపాయలు అవినీతి భూకబ్జాలు, గంజాయి విక్రయించడం యువతను పెడదోవ పెట్టడం జరిగింది. తాను దాదాపు 100 కోట్ల బకాయిలు ఉన్నట్లుగా అనుమానం కలుగుతుంది వెంటనే బిఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీసుకున్నటువంటి రుణాలను, బాకీలను వెంటనే వసూలు చేయాలని లేనట్లయితే అరెస్టు చేసి జైలుకు పంపాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మొన్నటికి మొన్న ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రాకేష్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే ఆర్మూర్ అంగడి మార్కెట్ స్థలాన్ని పరిశీలించి అక్కడ మహిళా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై అదేవిధంగా బాలికల పాఠశాల సందర్శించి బాలికల పాఠశాల సమస్యలను వెంటనే పరిశీలించి పరిష్కరించే చర్యలు తీసుకోవడం ఎంతో హర్షించదగ్గ విషయం అంతేకాకుండా గతంలో పని చేసినటువంటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరియు అతని అనుచరులు చేసినటువంటి అవినీతి అక్రమాలపై భూభాగవతాలపై సిటింగ్ జడ్జిచె విచారణ చేయించి వీరందరి పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని. కచ్చితంగా ప్రస్తుత ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అవినీతిపరుల పైన,అక్రమార్కుల పైన అదేవిధంగా యువతను పాడు చేస్తున్నటువంటి గంజాయి విక్రయ దారుల పైన ఉక్కు పాదం మోపడం ఖాయమని ఈ సందర్భంగా హెచ్చరించడమైనది.

ఈ పాత్రికేయ సమావేశంలో, బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు దొండి ప్రకాష్, బిజెపి ఆర్మూర్ పట్టణ కార్యదర్శి పులి యుగంధర్, గిరిజన మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పీర్ సింగ్, బిజెపి ఆర్మూర్ మండల ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్, నాగేష్, అల్జాపూర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here