నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినిత పవన్ పై అవిశ్వాసం ప్రవేశపెడుతూ ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతును మంగళవారం కలిశారు. గడిచిన రెండు రోజులుగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నేతృత్వంలో క్యాంపులో ఉన్న అసమ్మతి కౌన్సిలర్లు ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ పై అవిశ్వాసం ప్రవేశపెడుతూ 24 మంది బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కలెక్టర్ కు అవిశ్వాస పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు త్వరలోనే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. గడిచిన కొద్ది రోజులుగా ఆర్మూర్ మున్సిపల్ లో నెలకొన్న సందిగ్ధం నేటితో తెరపడినట్లు అయింది. ఎట్టకేలకు మున్సిపల్ చైర్ పర్సన్ భర్త పవన్, మరిది ప్రేమ్ లపై గత కొంతకాలంగా అసహనంతో ఉన్న సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాసం ప్రవేశ పెట్టడం చర్చనీ అంశమైంది. రానున్న రోజుల్లో అవిశ్వాసాన్ని నెగ్గుక రాగలుగుతామని ప్రస్తుత చైర్మన్ వినిత పవన్ విలేకరులతో చెప్పారు. కొంతమంది కావాలనే తమపై ప్లాన్ ప్రకారం అవినీతి ఆరోపణలు చేస్తూ అవిశ్వాసానికి తెరలేపారని ఆమె వివరణ ఇచ్చారు. రానున్న రోజుల్లో తామే ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఆర్మూర్ మున్సిపల్ లో గత కొంతకాలంగా అసమ్మతి కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రవేశపెడతామని చెబుతూ ఎట్టకేలకు 24 మంది కౌన్సిలర్లతో అవిశ్వాస తీర్మానం పై సంతకాలు చేసి జిల్లా కలెక్టర్ కు అందజేయడం జరిగింది.