నిజామాబాద్ A9 న్యూస్:తెలంగాణ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం విద్యార్థుల కోసం తీసుకుంటున్న చర్యలను, నిర్వహిస్తున్న సమీక్షలను, తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామని అన్నారు. టీఎస్పీఎస్సీ బోర్డ్ రద్దు చేసి నూతన బోర్డు ఏర్పాటు చేయడం పటిష్టంగా నిరుద్యోగ విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం వంటి నిర్ణయాలు హర్షించదగ్గవి అని, అయితే గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ బోర్డ్ చైర్మన్ గంటా చక్రపాణి నుండి మొదలు పెడితే ప్రస్తుత సభ్యులు ఇప్పటి చైర్మన్ జనార్దన్ రెడ్డి వరకు నిర్లక్ష్యం వల్లే అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అనేక మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయి కాబట్టి మళ్లీ అటువంటి ఘటనలను పునరావృతం కాకుండా అవినీతి అవకతవకలు నిర్లక్ష్యం ప్రదర్శించిన టిఎస్పిఎస్సి సభ్యులందరినీ వెంటనే జైలుకు పంపాలని అటువంటి పిశాచాలు సమాజంలో తిరగడం చూడలేమని కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలుపుతున్నామని అన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించి, విచారణ జరిపించి వారికి కచ్చితంగా కఠిన శిక్షలు వేసి క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోహేల్, మహేష్, అమాన్, సుజిత్, విష్ణు అక్మల్, సింహాద్రి, ఆదిత్య, అఖిలేష్, శశాంక్, కార్తిక్, కైఫ్ తదితరులు పాల్గొన్నారు.