నిజామాబాద్ A9 న్యూస్:
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ ఇంటిపై జరిగిన ఐటీ దాడుల్లో 353 కోట్ల రూపాయల అవినీతి డబ్బు బయటపడడాన్ని నిరసిస్తూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడమైనది.
ఈ ధర్నాను ఉద్దేశించి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు, నూతుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ అంటేనే అవినీతికి మారుపేరని. కాంగ్రెస్ స్కాoగ్రెస్ గా మారి 70 సంవత్సరాలు పరిపాలించి దేశాన్ని మొత్తాన్ని అవినీతి మార్చిందని దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీ భారతీయుడు యాత్ర సందర్భంగా 353 కోట్ల అవినీతి డబ్బులు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ దిరాజ్ సాహు ఇంట్లో ఉంచినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వీటిని ఆరు రోజులపాటు 50 మంది బ్యాంకు అధికారులు 40 కౌంటింగ్ మిషన్లతో లెక్కించడం జరిగిందని ఇంత పెద్ద మొత్తం డబ్బు దొరకడం దేశంలోనే తొలిసారి అని ధీరజ్ సాహు వద్ద దొరికిన ఈ నెల డబ్బులు ఎవరిదో సోనియా గాంధీ రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ అంటే అవినీతి అవినీతి అంటే కాంగ్రెస్ గా మారుపేరుగా మారిపోవడం జరిగిందని గతంలో ధీరజ్ సాహు అవినీతి పై మాట్లాడుతూ అసలు నోట్ల గట్టలు ఎలా పోవు చేస్తారని మాట్లాడడం ఓ విచిత్రమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయమని ఇంత పెద్ద మొత్తంలో మొత్తం అవినీతి జరుగుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ధీరజ్ సాహూను పార్టీ నుండి కానీ ఎంపీ పదవి నుండి కానీ సస్పెండ్ చేయకపోవడం విడ్డూరంగా ఉందని.
అవినీతిని నిర్మూలించేందుకు మోడీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనడానికి మరియు అవినీతిపరులను ఉక్కుపాదంతో అనిచి వేస్తుంది అనడానికి ఈ సంఘటన నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తూ.
తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవినీతికి పాల్పడితే కేంద్ర ప్రభుత్వం ఊరుకునే సమస్యలేదని అదేవిధంగా ఆర్మూర్ నియోజవర్గంలో కూడా జరిగిన అవినీతిపై, అవినీతిపరులపై ఉక్కు పాదం మోపడం ఆర్మూర్ నియోజకవర్గ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేయడమైనది.