నిజామాబాద్ a9 న్యూస్:
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలోని జీవన్ రెడ్డి మాల్ లో రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో జీవన్ రెడ్డి మాల్ లీజు బకాయిలు చెల్లించాలని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలియజేశారు. ఆర్టీసీకి సుమారు ఏడు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని అవి చెల్లించకుంటే జీవన్ రెడ్డి మాల్ ను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఆర్మూర్ ఆర్టీసీకి సంబంధించిన కొంత స్థలాన్ని ఒక ప్రైవేటు సంస్థ లీజుకు తీసుకోగా వారి నుండి జీవన్ రెడ్డి మార్పిడి చేయించుకుని సదరు మాల్ ను నిర్మించి ఆక్రమించారని ఇప్పటివరకు ఆర్టీసీకి బకాయిలు చెల్లించకుండా వస్తున్నారని సదరు బకాయిలు వెంటనే చెల్లించాలని వారన్నారు. ఇది ఇలా ఉంటే నూతనంగా ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పైడి రాకేష్ రెడ్డి తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఆర్టీసీ ప్రాంగణంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ బకాయిలను కక్కిస్తానని ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా వాగ్దానం చేశారు.
ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారడంతో జీవన్ రెడ్డి ఎమ్మెల్యే కాకపోవడంతో పరిణామాలు మారిపోయాయని ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఏది ఏమైనా నూతన ఎమ్మెల్యే మాటలను ఆర్మూర్ ప్రజలు నిజమవుతున్నాయా అని ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. మరి రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోవడంతో పరిణామం చోటు చేసుకుందేమోనని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా అప్పుడే మొదలైంది, పదవి పోయిన వెంటనే మాల్ పై దాడి షురూ అయిపోయిందని ప్రజలు గుసగుసలాడుతూన్నారు. వేచి చూడాలి మరి ఏమి జరుగుతుందో ముందు ముందు.