తెలంగాణ A9 న్యూస్:
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నేడు కొలువుదీరనుండగా ప్రగతి భవన్ వద్ద ఆంక్షలను కొత్త గవర్నమెంట్ ఎత్తి వేసింది. పదేళ్లుగా ఉన్న కంచెలను తొలగించాలని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు అందాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతిభవన్ వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఆంక్షలు విధించగా.. ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. కాంగ్రెస్ పాలనలో ప్రగతి భవన్‌కు రావొచ్చని.. తమ కంప్లైంట్స్‌ను ప్రజలు స్వేచ్ఛగా సీఎంకు చెప్పొచ్చని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వడంతో కంచె తొలగింపు పనులు స్టార్ట్ అయ్యాయి.
ఓ వైపు పనులు కొనసాగుతుండగానే ప్రగతి భవన్ ముందున్న బ్యారికేడ్స్ లోపలి నుంచి ట్రాఫిక్‌కు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు ఈ మేరకు చర్యలు చేపట్టగా జేసీబీలు, కార్మికులతో బ్యారికేడ్లను యుద్ధప్రాతిపాదికన తొలగిస్తున్నారు.