నిజామాబాద్ A9 న్యూస్:
—*హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యేది జీవన్ రెడ్డినే
—*మంథని గ్రామ బి .ఆర్.ఎస్ సీనియర్ నాయకుడు జీకే నర్సారెడ్డి
ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసిన తెలంగాణ ప్రజలు ప్రగతికే పట్టం కడతారని రాష్ట్రంలో రాబోయేది బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఆర్మూర్ లో హ్యాట్రిక్ ఎంఎల్ఏ గెలిచేది ఆశన్న గారి జీవన్ రెడ్డి నేన ని బి.ఆర్.ఎస్ మంథని గ్రామ సీనియర్ నాయకుడు జీకే నర్సారెడ్డి తెలియజేయడం జరిగింది . ఈ తొమ్మిదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పథంగా నడిపించిన ఘనత ఆర్మూర్ నియోజకవర్గంలో ఎంఎల్ఏ జీవన్ రెడ్డి దేనని ఈ క్రమంలో కొంతమందికి సంక్షేమ పథకాలు కరోనా మహమ్మారి వలన రెండు సంవత్సరాలు ప్రజా పరిపాలన వ్యవస్థ ఆగిపోవడం వలన కొంచెం ఆలస్యమైనా రానున్న బి.ఆర్.ఎస్ ప్రభుత్వం హయాములు ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తికి బి.ఆర్.ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని వారు అన్నారు . కొట్లాడి సంపాదించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఏదో ఒక రకంగా కుటుంబంలో ఎవరో ఒకరు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్నారు అంటే అది బి.ఆర్.ఎస్ ప్రభుత్వం యొక్క గొప్పతనం అని వారు అన్నారు . ఓట్ల కోసం చాలామంది నాయకులు వస్తూపోతూ ఉంటారు కానీ ప్రజల కోసం పనిచేసే ఏకైక నాయకుడు జీవన్ రెడ్డి అలాంటి నాయకుడిని గెలిపించుకోవడం బి.ఆర్.ఎస్ నాయకుడిగా నా కర్తవ్యం . సకలజనుల సంక్షేమమే బిఆర్ఎస్ ప్రభుత్వ ఎజెండా అని బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు మైలారం అజయ్ తెలియజేయడం జరిగింది.
అభివృద్ధి సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో గర్వించదగ్గ స్థాయిలో నిలబెట్టిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిధి. సంక్షేమ పథకాలను అదే స్థాయిలో ఆర్మూర్ నియోజకవర్గంలో ఆశన్న గారి జీవన రెడ్డి అమలుపరుస్తూ ఆర్మూర్ నియోజకవర్గాన్ని ఈ పదేళ్లలో వందేళ్ల అభివృద్ధి దిశగా అన్ని రంగాలలో ముందు నిలిపిన జీవన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ,ప్రతిపక్షాలు ఎన్ని ప్రలోభాలకు లోను చేసిన ప్రజలు ఓటు మాత్రం ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వేసి హార్ట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఎంఎల్ఏ జీవన్ రెడ్డిని కాకుండా వేరే పార్టీని ప్రజలు గెలిపించుకుంటే మళ్లీ నియోజకవర్గంలో కష్టాలు తప్పవన్న ప్రజల మాటలలోనే జీవన్ రెడ్డి గెలుపు స్పష్టమవుతుందని వారన్నారు. కుటుంబంలో ఒకనిగా ఉంటూ ప్రజలందరి మధ్యన ఉండే ఎమ్మెల్యేకే నియోజకవర్గ ప్రజలు మద్దతును ఇస్తారని ,ఎన్నికల అప్పుడు తప్ప మిగతా సమయంలో కనిపించని నాయకులకు ఓట్లు అడిగే హక్కు లేదని వారు అన్నారు.