తెలంగాణ A9 న్యూస్:
*ఓటర్ మిత్రమా ఆలోచించు…
*మిత్రమా మీ ఓటుని భద్రంగా వినియోగించుకోండి…
*చెప్పుడు మాటలు వినకండి…
మిత్రమా ఆలోచించి ఓటు వేయి నీ ఓటు ఐదు సంవత్సరాలని జీవితాన్ని మార్చగలిగే ఓటు నీ ఓటు మిగతా బడుగు బలహీన వర్గాల వారిని మార్చే ఓటు ఆ ఓటే లేకుంటే నీ బతుకు శూన్యమే ఆలోచించు అన్వేషించు నీ అన్వేషణలో నీ ఆలోచనలో ఎవరు నీకు ఎవరు సమాజానికి దోహదపడతారో ఆలోచించు సమాజాన్ని మార్చడానికి కృషి చేస్తారో వారికి నీ ఓటు వేయి వారిని నాయకుడిగా గెలిపించుకో లేదంటే బానిస బతుకులు తప్పవు బానిస సంకెళ్లు తప్పవు పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప అన్న నినాదమే నీకు గుర్తుకొస్తుంది కాబట్టి బానిసవైతావో ఆలోచించి ఓటు వేసి బానిస సంకెళ్లు తెంచే పోరాట యోధుడివైతావో ఆలోచించుకో 10 ఏళ్ల పాలనలో ఒరిగిందేముంది విద్యార్థులు నిరుద్యోగులు అన్నదాతలు ఎంతోమంది ప్రాణాలు తృణప్రాయంగా పెట్టి తెలంగాణను సాధించుకుంటే ఈరోజు తెలంగాణ ఎవరి పాలు అయిందో ఆలోచించుకో ఆ తెలంగాణలో నిరుద్యోగం ఎందుకు ఇంకా ఇంకా పెరుగుతుందో ఆలోచించుకో అన్నదాత ఎందుకు అలమటిస్తున్నాడో ఆలోచించుకో 400 కి సిలిండర్ ఇస్తామని హామీల మీద హామీలు కురిపిస్తున్నారు మరి గడిచిన 10 ఏళ్లలో ఎందుకు ఇవ్వలేదు ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచించం ఎందుకంటే ఇప్పుడు మనకు ఉచితాలు వస్తున్నాయి కదా ఉచితలా మోజులో పడి ఎవడైతే ఏంటి లే అని ఆలోచించకుండా ఓటు వేస్తే నీవు నీ కుటుంబము నీ భావితరము బానిస బతుకు తప్పదు ఆలోచించుకో సరియైన నాయకున్ని ఇప్పుడే ఎంచుకో ఈ అవకాశం పోతే మళ్ళీ 5 ఏళ్ల వరకు నీకు అవకాశం ఉండదు అప్పటివరకు నువ్వు బాధపడవలసిందే ఆ బాధ ఏ విధంగా ఉంటుందో నీకు బాగా తెలుసు అలా బాధపడదామా లేక ఆలోచించి ఓటు వేద్దామా నువ్వే ఆలోచించుకో మిత్రమా అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కమిటీ మెంబర్ కార్ల్ మార్క్స్ అన్నారు.