నిజామాబాద్ జిల్లా a9న్యూస్ :
విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేసిన బిఆర్ఎస్, బిజెపి పార్టీలను ఓడించండి -పి.డి.ఎస్.యూ, పి.వై.ఎల్
విద్యారంగాన్ని, ఉపాధిరంగాన్ని నిర్లక్ష్యం చేసిన బిఆర్ఎస్, బిజెపి పార్టీలను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని *పి.డి.ఎస్.యూ ఆర్మూర్ డివిజన్ ఆధ్యక్షులు ప్రిన్స్, పి.వై.ఎల్ ఆధ్యక్షులు ఎస్. వెంకటేష్* విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణ కేంద్రం పిడిఎస్యూ కార్యాలయంలో స్టూడెంట్ యూత్ మేనిఫెస్టోను పి.డి.ఎస్.యూ,పి.వై.ఎల్ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో విడుదల చేయటం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజం సామాజిక, సంస్కృతిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి చెందాలంటే, అసమానతలు తొలగాలంటే విద్య, వైద్యం ఉపాధి కీలకమైనవాని .కానీ పదేళ్ల కాలంలో బిఆర్ఎస్, బిజెపి పార్టీలు ఈ రంగాలను గాలికి వదిలేసాయి, నిర్లక్ష్యం చేశాయి. సమాజాన్ని తిరోగమనం వైపు నడిపించాయని. కాబట్టి యువత విద్యార్థులు బిఆర్ఎస్,బిజెపి పార్టీలను ఓడించమని పి.డి.ఎస్.యూ ,పి.వై.ఎల్ పిలుపునిస్తుంది. కాబట్టి క్రింది డిమాండ్ల సాధన కోసం పాలకవర్గ పార్టీలను నిలదీయాలని ,వీటి కోసం పోరాడాలని కోరుతున్నది.
1) ప్రభుత్వ రంగంలో విద్యా వైద్య రంగాన్ని అభివృద్ధి చేసి ప్రజలందరికీ ఉచితంగా అందించాలి.
2) జిల్లాకు ఒక ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి.
3) ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలి
4)రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి.
5) రాష్ట్రంలో శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలను నిషేధించాలి.
6) విద్యారంగానికి బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలి.
7) నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో రద్దు చేయాలి.
8)యూనివర్సిటీ లలో విద్యార్థి ఎన్నికలు నిర్వహించాలి.
9) ప్రైవేటు యూనివర్సిటీలను రద్దు చేయాలి.
10) మండలానికి ఒక్క జూనియర్ కాలేజీ, నియోజకవర్గానికి రెండు రెండు కాలేజీలు, జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీ నిర్మించాలి.
11) హాస్టల్ విద్యార్థులకు 5000 మెస్ చార్జీలు, 1000 రూపాయల కాస్మోనిక్ చార్జీలు ఇవ్వాలి.
12) ప్రభుత్వ విద్యాసంస్థలలో చదివే ప్రతి విద్యార్థికి ఉచితంగా బస్ పాసులు ఇవ్వాలి.
13) నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలి.
14) ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి 5000 ఇవ్వాలి.