నిజామాబాద్ A9 న్యూస్:

*నందిపేట మండలం లక్కంపల్లి గ్రామంలో….                             

*ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డికి మరో గ్రామస్తుల షాక్….

*దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని….

*చెప్పి 10 ఏండ్లు గా మభ్యపెడుతున్న బీఆర్ఎస్….

*బంగారు తెలంగాణ అంటూ కన్నీటి తెలంగాణగా మార్చారు అంటూ లక్కంపల్లి గ్రామస్తుల ఆగ్రహం….

*లక్కంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి చేసింది ఏమీ లేదంటూ వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు….

*గో బ్యాక్ జీవన్ రెడ్డి అంటూ నినాదంతో ఫ్లెక్సీలు ఏర్పాటు….

నందిపేట మండలం లక్కంపల్లి గ్రామంలో సోమవారం ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని అడ్డుకున్న గ్రామస్తులు  గతంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు అంటూ యువకులు ఆగ్రహం లక్కంపల్లి కి సంబంధించిన సేజ్జు పరిశ్రమంలో యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఇవ్వకుండా మభ్యపెడుతున్నాడు అంటూ యువకులు ఆవేదన చెందారు.

ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఎక్కడ అని ప్రశ్నించిన వారిపై తన అనుచరుడైనటువంటి లక్కంపల్లి సర్పంచ్ భర్త మూడ మహేందర్ బెదిరించి కొట్టడం జరిగిందని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి పదేళ్లు అవుతున్న ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం అంటూ నిరసన చేపట్టారు. బంగారు తెలంగాణ అంటూ కన్నీటి తెలంగాణ గా మార్చే ప్రశ్నించిన వారిపై తన అనుచరులతో కొట్టిస్తున్నాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *