నిజామాబాద్ A9 న్యూస్:
* జీవన్ రెడ్డి నా కుటుంబంలో సభ్యుడు…
* తెలంగాణ ఉద్యమం లో ఆయనది కీలక పాత్ర…
* నిత్యం ప్రజల మధ్యే ఉండే మంచి నాయకుడు…
* ప్రజల కోసం ఏదైనా అనుకున్నాడంటే సాధించేవరకు నిద్రపోడు…
* ఎర్రజొన్న రైతుల కోసం ఆమరణ దీక్ష చేసిండు…
* జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి….
ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తన కుటుంబంలో సభ్యుడు లాంటి వారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయనది తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర అని, నిత్యం ప్రజల మధ్యే ఉండే మంచి నాయకుడని సీఎం అభినందించారు.
జీవన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఉన్న సమయంలో ఆర్మూర్ లో ఎర్ర జొన్న రైతులకు కోసం ఆరమణ దీక్ష చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎర్రజొన్న రైతులపై పోలీసు కాల్పులు జరిపింది. నేను ఎక్కడ్నో కరీంనగర్ పర్యటనలో ఉన్నాను. ఇక్కడ కాల్పులు జరిగాయిని తెలిస్తే హుటాహుటిన ఆర్మూర్‌కు వచ్చాను. అప్పట్నుంచి జీవన్ రెడ్డి నాకు సన్నిహితుడై కుటుంబంలో ఓ సభ్యుడిలా ఉండి, పార్టీని ముందుకు తీసుకుపోతున్నారని ఆయన తెలిపారు.
జీవన్ రెడ్డి ఏదైనా కావాలంటే వెంబడి పడి సాధిస్తాడు. ఆలూరు, డొంకేశ్వర్ మండలాలు కావాలని అడిగితే అవసరమా అని ప్రశ్నించాను. జీవన్ రెడ్డి మూడు రోజులు నామీద అలిగి కూర్చుండు. ఆయన పొరుపడలేక ఆ రెండు మండలాలు ఇచ్చా. పట్టుదలతో నమ్ముకున్న ప్రజల కోసం పనులు చేయిస్తడు. అందుకే మీ అభిమానం ఇవాళ కనబడు తుంది. మీ కోసమే పని చేసే వ్యక్తి జీవన్ రెడ్డి. కొందరు ఇప్పుడొచ్చి ఆపదమొక్కులు మొక్కుతారు. అవన్నీ నమ్మకండి. ప్రజల కోసం పని చేసే, తన నియోజకవర్గం కోసం పాటు పడే వ్యక్తి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి అని కేసీఆర్ ప్రజలకు కోరారు.