నిజామాబాద్ జిల్లా A9న్యూస్
భూమికోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలని నిజామాబాద్ జిల్లా *న్యూ డెమోక్రసీ సహాయ కార్యదర్శి దాసు* పిలుపునిచ్చారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు గౌతం అధ్యక్షతన బోధన్ పట్టణములో 03నవంబర్2023న అమరవీరుల స్మారక సభను నిర్వహించారు.
ఈ సభలో దాసు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఒక మనిషి ఇంకోక మనిషి దోపిడి చేయని వ్యవస్థ కోసం, వేలాదిమంది తన ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించారనీ ఆయన తెలిపారు. 76 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో పేదరికం, నిరుద్యోగం, ఆకలి, అసమానతలు, అధిక ధరలు ప్రజల్ని వేధిస్తున్నాయ ని ఆయన అన్నారు. ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్, బిజెపి ,టిఆర్ఎస్ పార్టీలు విఫలం చెందాయని ఆయన తెలిపారు. వందలాదిమంది యువత బలి దానాలతో పురుడు పోసుకున్న తెలంగాణ సమస్యలకు నిలయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ తన స్వార్థం కోసం ఐదు లక్షల కోట్ల అప్పుల చేసి, ప్రజల నెత్తిన రుద్దిండని ఆయన అన్నారు. ఉద్యోగాల భర్తీ, విద్య వైద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా మోసం చేశారని ఆయన అన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడిని ప్రకటించి, అ తర్వాత దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పి, దళిత బంధు పేరుతో, దళితులను దగా చేశాడని ఆయన అన్నారు. 9 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో అవినీతి, నిర్బంధం రాజ్యమేలుతుందని, రాజకీయాల్లో నైతిక విలువలను పాతర వేశారనీ ఆయన తెలిపారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో విచ్చలవిడి దోపిడి కేసీఆర్ కుటుంబం కొనసాగించిందని ఆయన అన్నారు. భారత దేశ లౌకికత్వానికి తూట్లు పొడిసిన బిజెపికి పార్లమెంటులో సంపూర్ణ మద్దతు ప్రకటించి, ఎన్నికల సమయంలో బిజెపితో వైరం ఉన్నట్లు నటిస్తున్నారని ఆయన అన్నారు. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా, సమ సమాజ స్థాపన కోసం అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించుదామని దాసు పిలుపునిచ్చారు.
ఈ సభలో సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎండి కాజా మొయినుద్దీన్, బోధన్ సబ్ డివిజన్ నాయకులు కుమన్ పల్లి భుమన్న, జి. శ్రీనివాస్, పర్వన్నా, దాల్మల్కి పోశెట్టి,విఠల్, కళ్యాణ్, పోచన్న తదితరులు పాల్గొన్నారు.