నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల పెర్కిట్‌లో వివాహిత మహిళపై ఏఆర్ కానిస్టేబుల్ నటరాజ్ అత్యాచారం చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన ఓ వివాహిత మహిళ ఆమె భర్త కుటుంబ సభ్యులతో కలిసి ముంబాయిలో నివాసం ఉంటున్నారు. ఏఆర్ కానిస్టేబుల్ నటరాజ్‌కు ఆ వివాహిత మహిళ భర్త స్నేహితుడు. భర్తతో ఉన్న స్నేహాన్ని అవకాశంగా తీసుకొని ఏఆర్ కానిస్టేబుల్ నటరాజ్ ఆ వివాహిత మహిళతో పరిచయం పెంచుకొని మాయమాటలు చెప్పి బొంబాయిలో ఉంటున్న ఆ స్నేహితుని భార్యను ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్‌కు రప్పించాడు.
పెర్కిట్‌లో ఆ వివాహిత మహిళపై ఆ కానిస్టేబుల్ అత్యాచారం చేశాడు. బాధిత వివాహిత మహిళ ఫిర్యాదు మేరకు ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాయమాటలు నమ్మి అత్యాచారానికి గురైన బాధిత వివాహిత మహిళను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే స్నేహితుడు భర్తలతో ఉన్న స్నేహాన్ని అవకాశంగా తీసుకొని మాయమాటలు చెప్పి వివాహిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఏఆర్ కానిస్టేబుల్ నటరాజ్ పరారీలో ఉన్నాడు. ఏఆర్ కానిస్టేబుల్ నటరాజ్ కోసం ఆర్మూర్ పోలీసులు గాలిస్తున్నారు.