Monday, November 25, 2024

44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం యూపీ చెందిన నలుగురు మృతి

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ A9 న్యూస్: 

ఇందల్వాయి మండలం చంద్రయాన్ పల్లి గ్రామం వద్ద 44వ జాతీయ రహదారిపై రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యూపీ చెందిన నలుగురు మృతి చెందారు.

ప్రత్యక్ష సాక్షులు స్థానికుల వివరాల ప్రకారం ప్రమాద వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుండి సుమారు 150 మంది ప్రయాణికులతో యూపీ 43 ఏటి 5069 నంబరు గల బస్సు యూపీ కి బయలుదేరింది.

రాత్రి చంద్రాయంపల్లి వద్దకు చేరుకోగానే రోడ్డుపై నిర్లక్ష్యంగా నిలిపి ఉన్న లారీని ఢీ కొట్టింది. లారీని ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం ధ్వంసం కాగా డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి… ప్రమాద వివరాలు తెలుసుకున్న పోలీసులు టోల్ ప్లాజా సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని హెచ్చరిక బోర్డులు పెట్టి ట్రాఫిక్ ని నియంత్రించారు.

అంతలో బస్సు దిగిన ప్రదీప్ 40, గనేష్ 29, జీతు 32, దుర్గేష్ ప్రసాద్ బస్సు పక్కన నిలుచుని ఉండగా వెనుక నుండి నిర్లక్ష్యంగా వేగంగా వచ్చిన డీసీఎం వ్యాను వీరిని ఢీ కొట్టింది.. దీంతో ప్రదీప్ మరియు జీతు ఘటనా స్థలంలోనే శరీరాలు ఛిద్రమై మృతిచెందగా.. గనేష్ మరియు దుర్గేష్ ప్రసాదులు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు. ఘటనపై ప్రదీప్ సోదరుడు సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.. ప్రమాదానికి కారణమైన డీసీఎం మరియు బస్సులను స్టేషన్ కి తరలించమన్నారు. డీసీఎం డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here