నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ పట్టణ కేంద్రంలో 7వ వార్డు పరిధిలోని విశాఖ కాలనీలో తాళం వేసిన ఇంట్లో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. 7వ వార్డులోని విశాఖ కాలనీలో ఉంటున్న ఐసీడీఎస్ సీడీపీఓ భార్గవి వారం రోజుల కిందట ఇంటికి తాళం వేసి వారి స్వగ్రామానికి వెళ్లిందని స్థానికులు తెలిపారు.
స్థానిక కాలనీవాసులు ఇచ్చిన సమాచారం మేరకు సీడీపీఓ భార్గవి స్వగ్రా మం నుంచి ఆర్మూర్ లోని విశాఖ కాలనీకి బుధవారం వచ్చింది. మంగళవారం రాత్రి విశాఖ కాలనీలో ఉంటున్న భార్గవి ఇంట్లో గుర్తుతెలియని దుండగులు పడి ఇంట్లోని 50 వేల రూపాయల నగదును చోరీ చేసి ఎత్తుకెళ్లినట్లు భార్గవి ఆర్మూర్ లోని పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఆర్మూర్ పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.