నిజామాబాద్ A9 న్యూస్:
కాంగ్రెస్ పార్టీ గడప గడపకు ప్రచార కార్యక్రమంలో బాగంగా బుధవారం సాయంత్రం పాత బస్టాండ్ సెంటర్లో, పంత్ రోడ్లో దుకాణాలు, కూరగాయల మార్కెట్లో ఆర్మూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ ఈస్తున్నా 6 పథకాల గూర్చి ప్రతి ఒక్కరికీ వివరిస్తున్నారు. ఆర్మూర్ లో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వస్తే, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి అందిస్తామని వారికి తెలియజేశారు. ప్రతి ఇంటికి గృహా జ్యోతి కింద 200 యూనిట్లు ఉచితంగా కరేంట్ నీ అందిస్తామన్నారు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5లక్షలు అందిస్తామన్నారు, అంతే కాకుండా రైతు బరోసా కింద ప్రతి సంవత్సరం కౌలు రైతులకు 15000 రూపాయలు అలాగే వ్యవసాయ కూలీలకు 12000 రూపాయలు అంతే కాకుండా బోనస్ కింద 500 రూపాయిలు అందిస్తామన్నారు.
యువ వికాసం కింద విద్యార్థులకు 5లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డు ఇస్తుందన్నారు. అంతే కాకుండా చేయూత కింద 4000 నెలవారీ పింఛన్ 10లక్షల రూపాయల రాజు ఆరోగ్యశ్రీ బీమా అందజేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ గెలుస్తుందని మీ ఓటుతో ఈసారి బిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. గత రెండు పర్యాయాలు బిఆర్ఎస్ ఓటు వేసి నందుకు ఆర్మూర్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.