నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలోని మినీ లేదర్ పార్క్ ని సందర్శించిన కాంగ్రెస్ నాయకులు.
ఈ సందర్బంగా పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్ మాట్లాడుతూ 2003 లో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే కృషితొ ఆర్మూర్ కేంద్రంగా మినీ లేదర్ పార్క్ ఏర్పాటుకు శంకస్థాపన చేశారు అని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా పలు దఫాలుగా నిధులు మంజూరు చేసిన స్థానిక ఎమ్మెల్యే ఇతర పార్టీ వారు ఉండటంతొ వారితో సమన్వయ లోపంతొ లేదర్ పార్క్ పురోగతి సాధిoచటంలో విఫలం అయింది అని కాని ఇప్పుడు స్వరాష్ట్ర పాలనలో కూడ స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎంపీ అరవింద్ ల అలసత్వం, చిత్తశుద్ధి లేమితొ లేదర్ పార్కుకు నిధులు మంజూరు
చేసి అభివృద్ధి చేసి ఉపాధి కల్పించటంలో విఫలం అయ్యారు అని అన్నారు, రాజకీయ లబ్ది కోసం ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకంలో పెట్టిన శ్రద్దలో కొంచెం అయిన లేదర్ పార్కుకు నిధుల తేవటంలో పెడితె వందల మంది దళితులు ఇప్పటికే చెన్నై వెళ్లి శిక్షణ పొందిన వారికి స్వయంగా ఉపాధి దొరికేది అని, వారి యొక్క వయస్సు పెరుగుతుంది కాని వారు పొందిన శిక్షణ ఉపయోగ పడక వారు రోడ్లపై పని చేస్తున్నారు అని అదే విధంగా లేదర్ పార్కును పూర్తి స్థాయిలో వాడకంలోకి తెస్తే పరోక్షంగా వేల మందికి ఉపాధి దొరికేది అని,
నిధులు కేటాయిస్తే పార్కులో ప్లేయింగ్ యూనిట్, రా హెడ్ గౌడన్, రా మెటీరియల్ యూనిట్, శిక్షణ కేంద్రం, పరిపాలన భవనం, అందులో పని చేసే వారికి ఇళ్ళు, ఆరోగ్య కేంద్రం, పాఠశాల, విద్యుత్ సబ్ స్టేషన్ వంటి సదుపాయాలు కలుగుతాయి అని, ఇప్పటికైనా ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు చిత్తశుద్ధితొ లేదర్ పార్కుకు నిధులు కేటాయించె విధంగా చూడాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మీర్ మాజీద్, జిమ్మి రవి, అజ్జు, ఫాయీమ్, మీసాల రవి, అబ్దుల్ బారి, మెహబూబ్, శ్రీకాంత్, హబీబ్, ఉస్మాన్, పెద్ద పోశెట్టి, పాషా, ప్రసాద్, అభిమన్యు, మళ్ళీఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.