Monday, November 25, 2024

రైతులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్న ఎంపీ…

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ A9 న్యూస్:

దళిత వ్యక్తిని సీఎం చేస్తామన్నారు చేశారా…?

ప్రతీ దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు ఇచ్చారా…?

నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఇచ్చారా…?

బోధన్ లోని నిజాం చక్కెర కర్మాగారాన్ని స్వాదీనం చేసుకుని తెరిపిస్తామన్నారు తెరిపించారా…?

ఆర్మూర్ లోని లెదర్ పార్క్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు చేశారా…?

ఆర్మూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చి అన్ని రకాల వైద్య సదుపాయాలను, సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు ఏర్పాటు చేశారా…?

పసుపు బోర్డు కోసం భగీరథ ప్రయత్నం చేసి సాధించినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ శనివారం అరవింద్ ధర్మపురి గృహము పెర్కిట్ నందు బిజెపి జిల్లా అధికార ప్రతినిధులు జెస్సు అనిల్ కుమార్, ర్యాడ రవీందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ….

 

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అపర భగీరథుడిల, రాజకీయ చాణక్యంతో, పట్టువదని విక్రమార్కుడివలె నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఇచ్చినటువంటి మాటను, రైతులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని పసుపు బోర్డును సాధించడాన్ని హర్షిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేయడమైనది.

అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మతిభ్రమించి, నాలుకకు దూల ఎక్కువై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ పై ఇస్టారీతిన మాట్లాడడం సరైనది కాదని. ఇలాగే మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తూ. భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తుందో అది చేసి తీరుతుందని కాశ్మీర్లో 370 ఆర్టికల్ విషయంలో కానివ్వండి, రామ జన్మభూమి విషయంలో కానివ్వండి, తీన్ తలాక్ విషయంలో కానివ్వండి, మహిళా బిల్లు విషయంలో కానివ్వండి రాబోయే కాలంలో ఉమ్మడి పౌరస్మృతి కానివ్వండి ఇచ్చిన హామీలను స్పష్టంగా అమలు చేయడం జరిగిందని. కానీ బిఆర్ఎస్ నాయకులు తాను ఇచ్చిన వాగ్దానాలను కానీ నేను వేస్ట్ లో చెప్పిన విషయాలను కానీ ఈ ఒక్కడి నెరవేర్చలేనటువంటి దద్దమ్మలని.

దళిత వ్యక్తిని సీఎం చేస్తామన్నారు చేశారా ?            ప్రతీ దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు ఇచ్చారా ? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఇచ్చారా ? బోధన్ లోని నిజాం చక్కెర కర్మాగారాన్ని స్వాదీనం చేసుకుని తెరిపిస్తామన్నారు తెరిపించారా ? ఆర్మూర్ లోని లెదర్ పార్క్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు చేశారా ? ఆర్మూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చి అన్ని రకాల వైద్య సదుపాయాలను, సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు ఏర్పాటు చేశారా ? ఇవన్నీ హామీలు ఇచ్చిన మీరు ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం, బిజెపి పసుబోర్డ్ ప్రకటించగానే దిమ్మ తిరిగి మైండ్ దెబ్బతిని హిస్టారీతీన మాట్లాడడం మీరంతా తాగుబోతుల సంఘంగా ఏర్పడ్డారని స్పష్ఠవుతావుంది.

ఒకవైపు కేసీఆర్ తాగి తాగి అనారోగ్యం పాలై కనబడకుండా పోతే ఇంకోవైపు మోడీ చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తూ, ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు తీసుకెళ్తా ఉంటే కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఇస్టారీతీన మాట్లాడడం సరైనది కాదని. కేంద్రము రైల్వే లైన్ను, కొత్త రైళ్లను ఏర్పాటు చేస్తే మేమే చేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటూ రైల్వేల దగ్గర బీఆర్ఎస్ జెండాలు పట్టుకొని హరీష్ రావు జెండా ఊపడం తన యొక్క బుద్ధితనం ఏందో స్పష్టమవుతోంది. ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు రాబోయే కాలంలో కేసీఆర్ ను గద్దెదించి, బిఆర్ఎస్ ను బొంద పెట్టడం ఖాయమని ఈ క్రమంలో తెలియజేశారు.

 

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here