నిజామాబాద్ A9 న్యూస్:
మధ్యాహ్న భోజన కార్మికులు గత తొమ్మిది రోజులుగా సమ్మె నిర్వహించటం జరుగుతుంది ధర్నా చౌక్ లో సిఐటి ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె శిబిరానికి హాజరై సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు సంఘీభావం ప్రకటించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అదనంగా రాష్ట్ర ప్రభుత్వం
తొమ్మిది పది తరగతులకు నిర్వహించటంతో పాటు ఉదయం పూట అల్పాహారాన్ని కూడా అందించాలని నేటి నుండి నిర్ణయం చేయటం జరిగిందని కానీ పిల్లలకు వండి పెట్టే మధ్యాహ్న భోజనం కార్మికుల ఆకలి తీరే విధంగా వేతనాలను చెల్లించకుండా వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని కేవలం వెయ్యి రూపాయలు ఇచ్చి విద్యార్థులందరికీ నాణ్యమైన భోజనం వండి పెట్టాలని కించటం ఏ విధంగా కార్మికులు బతకగలుగుతారని ఆయన అన్నారు పైగా ఇటీవల ప్రభుత్వం కార్మికులకు 3000 రూపాయలు వేతనం చెల్లిస్తామని చెప్పి ఆరు నెలలు గడిచినప్పటికీ వాటిని ఇవ్వకుండా కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకోవడం బానిసత్వానికి నిదర్శనమని ఫ్యూడల్ భావజాలంతో ఉన్న ప్రభుత్వం బానిస చాకిరి చేయించుకోవడానికి అలవాటు పడుతున్నారని కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా భద్రత కల్పించకుండా బానిసచాకిరీ చేయించుకోవటం సరైనది కాదని విమర్శించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు చెల్లించి భద్రత కల్పించడంతోపాటు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అమలు జరపాలని, బకాయిలను వెంటనే చెల్లించాలని వంట పాత్రలను సరిపడా ఇవ్వటంతో పాటు సరుకులను ,గుడ్లను వంట గ్యాస్ ను ప్రభుత్వమే సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యల కోసం జరిపే పోరాటానికి సిపిఎం జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి, జిల్లా నాయకులు సుజాత, పర్వవ, రామ్ రెడ్డి, నరసవ్వ, సాయవ్వ తదితరులు పాల్గొన్నారు.