నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ పట్టణంలో దళిత బందు, బీసీ బంధు, మైనారిటీ బంధు లను బిఆర్ఎస్ బంధులుగా మార్చి రాజకీయంగా లబ్ది పొందాలని మరియు కానుకల ద్వారా మభ్యపెట్టి మరోసారి నియోజకవర్గ ప్రజలను మోసం చేయాలనీ చూస్తున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కుట్ర లపై మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు
ఈ సందర్బంగా పీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, దళిత, బీసీ, మైనారిటీ బంధులను బిఆర్ఎస్ బంధుగా మార్చి రాజకీయ లబ్ది పొందుతున్నడు అని, నియోజకవర్గంలో కొన్ని 10 వేలకు పైగా దళిత కుటుంబాలు ఉంటే కేవలం 100 మందికి దళిత బందు ఇచ్చి అది కూడ వారి పార్టీ నాయకులు కౌన్సిలర్లు, సర్పంచ్లకు, ఎంపీటీసీ లకు ఇచ్చాడు సామాన్య దళిత కుటుంబలకు ఇవ్వలేదు అని ఇప్పుడు కొత్తగా ప్రతి ఊరికి పదుల సంఖ్యలో నియోజకవర్గంలో వేల మందికి దళిత బందు ఇస్తాం అని ఆశ చూపుతూ వారిని వారి వెంట తిప్పుకుంటూ మోసం చేస్తున్నాడు అని అన్నారు, ఇదే విధంగా బీసీ, మైనారిటీలను కూడ మోసం చేస్తున్నాడు అని వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటే 100 మందికి ఇచ్చి మోసం చేసాడు అని అన్నారు, ఇదే విధంగా తొమ్మిదిన్నర సంవత్సరాల నుండి ఒక్కరికి కూడ ఇళ్ళు ఇవ్వకుండ కొత్తగా గృహలక్ష్మి అని ఇప్పడుదరఖాస్తు చేసుకోడానికి కేవలం మూడు రోజుల సమయం ఇచ్చి మరోసారి మోసం చేస్తున్నాడు అని అన్నారు, యువతను ఇన్ని రోజులు మోసం చేసి ఇప్పుడు కొత్తగా క్రికెట్ కిట్లు ఇస్తే అది కూడ ఊరికి ఒక్కటి ఇచ్చి మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసే స్థితిలో యువత లేదు అని మీకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారు అని అన్నారు. కావున జీవన్ రెడ్డి చూపే ఆశకు మోసపోకుండా బిఆర్ఎస్ వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీని బలోపేతం చేసి జీవన్ రెడ్డి పాలనను బంద్ చేస్తే అందరికి పథకాలు అందటం చాలు అవుతాయి అని అన్నారు
గత వారం రోజులుగా మనం చూస్తున్నమ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల్లో లబ్ది పొందటానికి రైస్ కుక్కర్లు ఛీరలు పంచటం చూస్తున్నాం అని ఇంకా ఏవేవో పంచుతాడు అని వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నారు అని ప్రజలు ఇవన్నీ తీసుకోని ఇంకా డిమాండ్ చేయాలని ఇదంతా మీరు ఓట్లేసి జీవన్ రెడ్డిని ఎమ్మెల్యే గా గెలిపిస్తే ఆ పదవిని ఉపయోగించుకొని మీకు న్యాయం చేయక ఆ పదవిని అడ్డం పెట్టుకొని వేల కోట్లు అడ్డగోలుగా సంపాదించాడు అని మీకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కాని, యువతకు ఉద్యోగలు కాని, రైతులకు మద్దత్తు ధరలు కాని, దళితులకు మూడు ఎకరాలు కాని ఇవ్వాక విఫలం అయి, దోచుకున్న డబ్బుతొ ఇటువంటి కానుకలు ఇచ్చి మిమ్మల్ని మరొక్కసారి మభ్య పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడు అని మీరంత అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలి అని కాంగ్రెస్ పార్టీ ఎటువంటి వివక్ష చూపకుండా అందరికి పారదర్శకంగా పథకాలు అందుతాయి అని అన్నారు, 6 గ్యారంటిలు గెలిచిన 100 రోజుల్లో అమలు చేస్తాం అని అన్నారు.