నిజామాబాద్ A9 న్యూస్:
ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కొరకు గత 12 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ వద్ద ఆశ వర్కర్లు రాస్తారోకును నిర్వహించి సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని నినాదాలు చేస్తూ నిరసనన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కరోనా సమయంలో, అత్యవసర సేవలను అందించారు.
ఆశ వర్కర్లు ప్రజలకు అండగా నిలబడుతూ వారి ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు వైద్య సేవలను అందించటంలో ముందుంటున్న ఆశా వర్కర్ల పైన విపరీతమైన పని భారం పెరగటంతో పాటు పెరుగుతున్న ధరల మూలంగా తమ వేతనాలు సరిపోకపోవడంతో కనీస వేతనం 18000 చెల్లించాలి, భద్రత కల్పించాలని హెల్త్ ఇన్సూరెన్స్, పీఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కల్పించాలని అనేకమార్లు ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ స్పందించకపోవడంతో సమ్మె నిర్వహించడం జరుగుతుందని.
ప్రజల ఆరోగ్యాలను కాపాడటంలో ముందుంటున్న ఆశ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరైనది కాదని వెంటనే ఆశ వర్కర్లతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేయాల్సి వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు సుకన్య, బలమని, లలిత, షరీఫా తో పాటు పెద్ద ఎత్తున ఆశ వర్కర్లు పాల్గొన్నారు.