Thursday, November 28, 2024

పసుపు బోర్డు పై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారం

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ A9 న్యూస్:

*పసుపు రైతుల దశాబ్దాల కల నెరవేర్చిన ఎంపీ ధర్మపురి అర్వింద్

 

*మోడీ దీవించారు ఏ డీ సాధించారు

 

*బీజేపీ నిజామాబాద్ జిల్లా అధికార ప్రతినిధి బుస్సాపూర్ శంకర్

పసుపు రైతుల దశాబ్దాల కల పసుపు బోర్డు సాధించి ప్రజల గుండెల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చిరస్థాయిగా నిలిచిపోతారని భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధికార ప్రతినిధి బుస్సాపూర్ శంకర్ తెలిపారు.

నిజామాబాద్ నగరంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ పసుపు బోర్డు, మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు కోట్ల నిధులు, అదే విధంగా రైల్వే లైన్ డబ్లింగ్ వంటి గొప్ప పనులు ప్రజలకు ఎంతో ఉపయోగపడే పనులు చేశారన్నారు.

పసుపు బోర్డు ద్వారా రైతులకు విత్తనాలు చల్లడం నుంచి మొదలుపెట్టి ఎక్స్పోర్ట్ వరకు ఎంతో లబ్ది చేకూరుతుందని అన్నారు.

పసుపు బోర్డు పై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్నీ ఖండించారు.

ఎంపీ అర్వింద్ తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలతో ఏ ఒక్క హామీ అయిన నిలబెట్టుకున్నార అని ప్రశ్నించారు.

రైతులకు మంచి చేసినప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి అందరూ అర్వింద్ గారిని అభినందించాలన్నారు.

ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న పసుపు బోర్డు కలను సాకారం చేసి కోట్ల మంది పసుపు రైతులకు భరోసా కల్పించిన “పసుపు బోర్డు” తేవడానికి ఎంపీ అర్వింద్ చేసిన కృషి మరువలేనిది అన్నారు.

2030 నాటికి పసుపు ఎగుమతిలో $1 బిలియన్ల లక్ష్యంతో పని చేస్తోందన్నారు

గిరిజనుల చిరకాల వాంఛ అయిన ఉన్నత విద్యను లక్ష్యములు మరియు ఆశయములు అందించే

సమ్మక్క-సారక్క యూనివర్శిటీ ఏర్పాటుకు ఆమోదం ఎంతో గొప్ప విషయం అని అన్నారు.

తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన హామీ నిలబెట్టుకునే ప్రభుత్వమే’ బిజెపి ప్రభుత్వం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఐటీ వింగ్ నిజామాబాద్ పార్లమెంటు కన్వీనర్ ఈగ ఆశిష్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు బాగా రెడ్డి, బీజేపీ బీసీ మోర్చా జిల్లా కోశాధికారి ఆప్కారి రాజన్న, బీజేపీ నాయకులు హరీష్ కుమార్, వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here