నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ నియోజక వర్గంలోని ఆలూరు మండల కేంద్రంలోని ఆలూరు సొసైటీ చైర్మన్ గా తంబూరి శ్రీనివాస్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి హాజరై మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, రైతు బీమా, రైతుబంధుతో పాటు అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. ఆలూరు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలను నమ్మవద్దని సూచించారు. వచ్చే ఎన్నికల్లో తనను మరోసారి గెలిపించాలని కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ పనులతో గ్రామాలను ముందు వరుసలో ఉంచుతున్నందున మరోసారి ఆశీర్వదించి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని జీవన్ రెడ్డి ఆర్మూర్ ప్రజలను కోరారు. అనంతర నూతనంగా ఎన్నికైన సొసైటీ చైర్మన్ బండమీది జమున గంగాధర్, ఎంపీటీసీలు మర్కంటి లక్ష్మీ మల్లేష్, ఉమ్మెడ లినిత మహేష్, బీఆర్ఎస్ ఆర్మూర్ మండల అధ్యక్షుడు మూలాకిడి శ్రీనివాస్ రెడ్డి, గోవింద్ పెట్ సొసైటీ చైర్మన్ బంటు మహిపాల్, ఆర్మూర్ మాజీ వైస్ ఎంపీపీ గోవింద్ పెట్ గంగాధర్, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ లోక ముత్యం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ ఇట్టడి లింగారెడ్డి, పిప్రి మాజీ ఎంపీటీసీ సభ్యుడు కేసి ముత్తేన్న, టిఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు కలిగోట గంగాధర్, సొసైటీ సీఈఓ తొర్తి మల్లేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.