నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ నియోజక వర్గ ప్రజలే తన కుటుంబ సభ్యులని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ వ్యాప్తంగా నిత్యం గులాబీ గూటికి వలసల జోరుగా సాగుతోంది. తాజాగా ఆర్మూర్ పట్టణంలోని రెండో వార్డులో గల వడ్డెర కుల సంఘం సభ్యులు, ఆర్మూర్ మండలం గగ్గుపల్లి గ్రామానికి చెందిన మాల సంఘం సభ్యులు, ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన షౌక పట్ల కాలనీ వాసులు, ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామం లోని అన్ని కుల సంఘాల ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తామంతా బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఆర్మూరు లో బుధవారం జరిగిన కార్యక్రమంలో వారిని జీవన్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి బీఆర్ ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ లో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని, కడుపులో పెట్టుకొని చూసుకుంటామని జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ మాయలో పడకండని, ఈ రెండు అభివృద్ధి నిరోధక పార్టీలని జీవన్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ ను మళ్లీ ఆదరించండని, ఆర్మూర్ ఎమ్మెల్యేగా తనను మూడోసారి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎంపీపీ పస్కా నరసయ్య, మాక్లూర్ ఎంపీపీ మాస్త ప్రభాకర్, ఆర్మూర్ జెడ్పీటీసీ మెట్టు సంతోష్, ఆర్మూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పుట్టింటి లింభారెడ్డి, రాంపూర్ మాజీ సర్పంచ్ బోడ్డు గంగాధర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాట్ పల్లి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.