నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ లోని బ్రాహ్మణ సమాజానికి తన వంతుగా సహాయ సహకారాలు అందించి అండగా ఉంటానని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో బ్రాహ్మణ సంఘం వారు ఏర్పాటుచేసిన సంఘ భవనానికి మంగళవారం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.
దేశంలోనే గర్వించే విధంగా యాదాద్రి నరసింహస్వామి క్షేత్రాన్ని అభివృద్ధి చేశారన్నారు పూజారులకు ప్రతినెల వేతనాలు చెల్లిస్తున్నారని చెప్పారు. తనను రెండుసార్లు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరోసారి ఆశీర్వదించాలన్నారు. ఈ సంఘ భవనానికి, ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, కౌన్సిలర్ ఇనుగంటి వరలక్ష్మి లింబాద్రి గౌడ్, బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రావు, సత్యం పంతులు, సంఘం అధ్యక్షులు దిగంబర రావు, అధ్యక్షుడు పింగళి రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి భీమ్ గల్ రాజు పంతులు, కోశాధికారి నరేందర్, కాళిదాస్ రావు, సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.