నిజామాబాద్ A9 న్యూస్:
దళిత బంధు ఎవరికోసం పేదల కోసమా… ఉన్న వాళ్ల కోసమా..?
దళిత బంధు ఎమ్మెల్యేకు నచ్చినవారిక….?
బీఆర్ఎస్ నేతలు దళిత బంధు కేటాయింప…?
మూడో విడత అని అంటున్నారు ఉన్నవాళ్లు పొట్టలు నిన్నట్లే…
మాకు ఎప్పుడు వచ్చేది దళిత బంధు….?
రెండవ విడత ధళిత బందు పంపిణి ప్రారంభంకు ముందే ఎమ్మెల్యేలకు నిరసన సెగ ప్రారంభమైంది. అర్హులకు దళిత బందు ఇవ్వాలని అధికార పార్టి నేతలను మాత్రమే దళిత బంధు పథకం కోసం ఎంపిక చేస్తున్నారని, బీఆర్ఎస్ నేతలు దళిత బంధు కేటాయింపు కోసం చేతి వాటం ప్రదర్శిస్తున్నారని దళితులు మండిపడుతున్నారు.
సోమవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక విషయంలో నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇందల్వాయి మండలం సిర్నాపల్లి దళితులు తమ గ్రామానికి ఎమ్మెల్యే రావద్ధంటు రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచే వేసి నిరసన తెలిపారు. ఎకంగా రోడ్డుపై ప్లకార్డులు ప్రథర్శించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటు నినాదాలు చేశారు. దానికి తోడు దళిత బంధు ఎంపికలో బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రాధన్యత ఇస్తు అర్హులకు ఇవ్వడం లేదని ఆరోపణలు చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు నిరసన సెగ మింగుడు పడని అంశంగా మారింది.