నిజామాబాద్ A9 న్యూస్:
ఇందల్వాయి మండల కేంద్రంలోని సోమవారం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి గాంధీ జయంతిని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పాశం సత్యనారాయణ మాట్లాడుతూ అక్టోబరు 2, 1869 నుండి జనవరి 30, 1948 ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు.
ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి చెప్పాడు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లింగంపల్లి రాజేందర్, గ్రామ ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్, మాజీ వైస్ ఎంపీపీ ఎడపల్లి ముత్తన్న, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కుమ్మరి మోహన్, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు తొగరి కాశీరాం తదితరులు పాల్గొన్నారు.