నిజామాబాద్ A9 న్యూస్:
ఆలూరు మండలం దేగాం గ్రామం లో సోమవారం గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ ఎస్ సి సెల్ రాష్ట్ర కన్వీనర్ దేగాం ప్రమోద్ పాల్గొని పూలమాల వేసి, ఆయన మాట్లాడుతూ భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీ 1869, అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో జన్మించారు, గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ, బాపూజీ భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలకపాత్ర పోషించారు.
స్వాతంత్ర్య పోరాటంలో భారతీయులను ఏకంచేసి, అహింసా మార్గాన్ని అనుసరించి, దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో ముఖ్యమైన భూమికను అయన అందించారు, ఈ కార్యక్రమంలో విలేజ్ ప్రెసిడెంట్ చుక్కల గంగాధర్, ఉపాధ్యక్షులు యాదగౌడ్, గంగా రాజన్న, సాయన్న దేగాం కాంగ్రెస్ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.