నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ పురపాలక సంఘ కార్యాలయంలో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. అందులో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు మరియు మునిసిపల్ సిబ్బందికి హెల్త్ చెకప్ చేయించడం, వారికి కావలసిన మెడిసిన్ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ పండిత్ వినీత పవన్ మరియు కమిషనర్ ప్రసాద్ చౌహన్, ప్యూటీ డిఎం, హెచ్ ఓ రమేష్, డి ఈ, సానిటరీ ఇన్స్పెక్టర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ , మున్సిపల్ సిబ్బంది హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.