నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ పట్టణంలోని దోబీ ఘాట్లో వద్ద చాకలి ఐలమ్మ 128వ జయంతి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత పవన్, కౌన్సిలర్లు
ఈ కార్యక్రమం లో చైర్మన్ వినీత మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం పోరాటాలు చేసిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. నేటి మహిళలకు చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు భాగ్య శివకృష్ణ, సుజాత రమేష్, వనం శేఖర్, వరలక్ష్మి లింబాద్రి గౌడ్, రజక సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.