నిజామాబాద్ A9 న్యూస్:
* ఇందల్ వాయి లో వీరవనిత చాకలి ఐలమ్మ 128వ జయంతి
*తెలంగాణ పోరాట యోధురాలు ఐలమ్మ యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కొనియాడాలీ
ఇందల్వాయి మండలంలోని బస్టాండ్ పరిధిలో మంగళవారం పోరాట యోధురాలు వీరవనిత చాకలి ఐలమ్మ జయంతిని, ఇందల్వాయి మండల రజకులు ఆమె యొక్క స్ఫూర్తిని పోరాటాన్ని మన తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోవద్దని, ఆమె పోరాటం ఒక కులానికో ఒక మతానికో కాదని.ఆమె యొక్క పోరాటం ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలందరి కోసమని ఆమె జయంతిని ఆమె వర్ధంతిని అన్ని వర్గాల వారు జరిపించాలని, ఆమెకు కృతజ్ఞతలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందని. ఆమె చాకలి కులానికి చెందినదని కొందరు ఆమె జయంతి కోసం రావడానికి కూడా ఇష్టపడరని ఇలాంటి వారు ఆమె యొక్క చరిత్రని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందని.
ఈ సందర్భంలో మండల అధ్యక్షుడు తెలిపారు, అంబేద్కర్ జయంతి ని ఎలా జరుపుకుంటారు ఆయన తర్వాత ఈమె కూడా అంతటి పోరాటాన్ని చేసిన ఘనత, చాకలి ఐలమ్మదేనని ప్రభుత్వమే అధిక అధికారికంగా ఆమె యొక్క జయంతి వర్ధంతిలను నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేయడం. తెలంగాణ రజకులు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటుంది. ట్యాంక్ బండి పై ఆమె యొక్క విగ్రహాన్ని నిర్మించుటకు ప్రభుత్వం అధికార ప్రకటన చేసింది, ఇది తెలంగాణ ప్రజలకు తెలియదా ఆమె స్ఫూర్తిని పోరాటాన్ని గుర్తించుకొని జయంతి వర్ధంతి లకు అందరూ కలిసి పాల్గొనాలని తెలియజేశారు. ఈ యొక్క జయంతి కార్యక్రమంలో మండల అధ్యక్షులు జితేందర్, ఉపాధ్యక్షులు మహేష్, కోశాధికారి మోహన్, ముఖ్య సలహాదారులు రవీందర్, సలహాదారులు దత్తు భాయ్, దాసు, గంగారం, చిన్న గంగారం, బుజ్జన్న, మహిళలు తదితరులు పాల్గొన్నారు.