నoదిపేట్ మండల కేంద్రంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.
నిజామాబాదు జిల్లా, సెప్టెంబర్ 26, A9న్యూస్.
ఈరోజు నందిపేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వీరనారి తెలంగాణ పోరాటయోధురాలు మహిళ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి ని ఘనంగా నిర్వహించడం జరిగింది .చాకలి ఐలమ్మ దొరలూ ,రజాకార్ల ,అరాచకాలను ఎండగడుతూ మహిళలకు స్ఫూర్తిగా నిలిచినా యోధురాలు గారి విగ్రహానికి పులా మాలలతో జయంతి ని నిర్వహించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మంద మహిపాల్ మాట్లాడుతూ…వీరనారి చాకలి ఐలమ్మ నిజాం రాష్ట్రం ఆంధ్ర మహాసభ నాయకత్వంలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపూర్ లో 1895 సెప్టెంబర్ 26న జన్మించారు. ధైర్యవంతురాలైన ఐలమ్మ వంగి దండాలు పెట్టే రోజుల్లో సివంగిలా గర్జించారు.ఈ పోరాటంలో అనేక ఇబ్బందులు ఎదురైన మొక్కవోని ధైర్యంతో రోకలి బండ చేతబూని దొరలపై పోరాడారు.ఆమె పోరాట స్ఫూర్తి దేశ్ ముఖ్ ను ఎదిరించిన వైనం మహిళల శక్తికి స్ఫూర్తిదాయకం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఎస్ గంగాధర్ ,మైనార్టీ అధ్యక్షులు ఇసుబ్ ,అర్ముర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బైండ్ల ప్రశాంత్ ,ఎడ్డిగారి నిఖిల్ ,యూత్ కాంగ్రెస్ మండల్ అధ్యక్షులు పీరాజి నాగరాజ్ ,ఉపాధ్యక్షులు ఎర్రం పవన్ ,ఫెరోజ్ ,సమీర్ ,చుక్కబొట్ల గంగారెడ్డి ,కలాచిన్న బోజన్న పాల్గొన్నారు