నిజామాబాద్ A9 న్యూస్:
పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 107వ జయంతిని చిత్రపటానికి ఘనంగా నివాళులు పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడమైనది. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి జివి నరసింహారెడ్డి, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, బిజెపి ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు రెడ్డి మాట్లాడుతూ…
పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారక్ గా, భారతీయ జన సంఘ్ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ అధ్యక్షుడిగా, భారత దేశ సాంస్కృతిక వైభవం, ఏకాత్మతా మానవతావాదం అనే సూత్రంతో దేశ అభివృద్ధిని కోరుకున్నారని. ఈ దేశంలో ప్రభుత్వ ద్వారా అందించేటటువంటి పథకాల యొక్క లాభాన్ని చిట్టచివరి బీద వ్యక్తికి కూడా ఈ ఫలాలు చేరాలని కోరుకున్నటువంటి. ఏవైతే తాను కలలు గన్నాడో ఆ కలలను భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏకాత్మతా మానవతా దర్శనం సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని అంత్యోదయ విధానం కింద ఈ దేశంలోని చిట్టచివరి నిరుపేదకు కూడా అభివృద్ధి ఫలాలు అందే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారని. దాంట్లో భాగంగానే పేదవారికి గ్యాస్, జన్ ధన్ ఖాతాలు, ప్రధాని ఆవాస్ యోజన ద్వారా పేదలకు ఇండ్లు, స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామ జ్యోతి యోజన ద్వారా ప్రతి గ్రామానికి కరెంటు సరఫరా, దీన్ దయాల్ కౌశల్ యువజన ద్వారా స్కిల్ డెవలప్మెంట్ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని.
సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదంతో అందరికీ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల ఫలాలను అందించే విధంగా ఈ దేశం ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉందనని. ఈ యొక్క అభివృద్ధిలో భాగంగానే సమాజంలో ఆడపిల్లలకు సమాన అవకాశాలు రావాలన్న లక్ష్యంతో నూతన పార్లమెంట్లో మహిళా సాధికారికత కోసం చట్టసభలో సైతం 33 శాతం రిజర్వేషన్ను కల్పించడం జరిగిందని. అదేవిధంగా భౄన హత్యల నిర్మూలన కోసం బేటి బచావో బేటి పడావో నినాదంతో, అదే విధంగా బాలికల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగిందని.
ఈ విధంగా దేశవ్యాప్తంగా సరికొత్త పథకాలతో కేంద్ర ప్రభుత్వం “పీఎం విశ్వకర్మ” పథకాన్ని శ్రీకారం చుట్టి పండిత్ దీన్ దయాల్ యొక్క సైద్దాంతిక భూమికతో కూడినటువంటి ఆత్మ నిర్మర్ భారత్ లక్ష్యంతో ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా, ఐదవ ఆర్థిక శక్తి కలిగిన దేశంగా నిర్మాణం చేయడంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కృతకృత్యులయ్యారని కావున రాబోయే కాలంలో ప్రజలు మరోసారి కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని బలపరచాలని ఈ సందర్భంగా కోరడమైనది.
ఈ కార్యక్రమంలో బిజెపి మరియు వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.