నిజామాబాద్ A9 న్యూస్:
మెగా రక్తదాన శిబిరం విజయవంతం కోటపాటి ప్రముఖ సామాజిక సేవ మరియు ఉద్యమకారుడు రైతు నాయకుడు కోటపాటి నరసింహం నాయుడు తన పుట్టినరోజు సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్ ఎమ్మార్ గార్డెన్ లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది. కోటపాటి తన ప్రతి పుట్టినరోజున యువకులను ప్రోత్సహించి రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది.
ఆనవాయితీగా పెట్టుకున్నారు దానిలో భాగంగా సోమవారం ఆర్మూర్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో దాదాపు 100 మంది రక్తదానం చేశారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ వైద్యులు రాష్ట్ర ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ డాక్టర్ మధు శేఖర్ మరియు ఆర్మూర్ ఆర్డీవో వినోద్ కుమార్ వాళ్లు పాల్గొని కోటపాటి చేస్తున్న సామాజిక సేవలను యువకులు, ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమానికి ఆర్మూర్ న్యాయవాదులు భూపతి రెడ్డి, జక్కుల శ్రీధర్, తులసిదాస్, క్రాంతి, ఏం కే నరేందర్, చరణ్, బుట్టి మధు, ఏరుగట్ల గణేష్, శ్రీనివాస్, ఎం కె నాగరాజు, చేయూత స్వచ్ఛంద కార్యదర్శి కుక్కల విద్యాసాగర్, ఈ కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు అందజేయడం జరిగింది. కోడ్ ఆర్డినేటర్ గా ఊరే బాలయ్య, జక్కుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.