Wednesday, November 27, 2024

ఉద్యమాలకు ఊపిరిపోసిన మహానీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ పట్టణంలోని సంతోష్ నగర్ లో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్బంగా వారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పద్మశాలి సంక్షేమ సేవ సమితి అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్ మాట్లాడుతూ 1969 తొలి దశ పోరాటంలో కీలక పాత్ర పోషించి మంత్రి పదవిని కూడా త్యజించిన మహానీయుడు. మూడు దశల ఉద్యమాలకు ఊపిరిలూడిన మహనీయుడు. తెలాంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిది అని అయన స్వాతంత్ర్య పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలాంగాణ కోసం ఇలా మూడు దశల ఉద్యమాలలో ప్రముఖ పాత్ర పోషించి దేశ సేవకు అంకితమైన పద్మశాలి ముద్దు బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు, ఆయన ఆశయ, సాధనాకోసం మనం ఐక్యంగా కృషి చేయాలని పద్మశాలి సంక్షేమ సేవ సమితి అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో తర్ప పద్మశాలి సంఘాల అధ్యక్షులు నూకల నారాయణ, బండి అనంతరావు, రుద్ర రాజేశ్వర్, సదామస్తుల గణపతి, ఏడెల్లి శ్రీనివాస్, బత్తుల భాస్కర్, మ్యాక విష్ణు దాస్ సురుకుట్ల బూమేశ్వర్, తాటిపాముల గంగాధర్, గుడ్ల చిన్న లింగం, దేవేందర్, కేదారేశ్వార తదితరులు పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here