నిజామాబాద్ A9 న్యూస్:
ఖుదవంద్ పూర్ గ్రామంలోని ప్రజలు వినాయక చవితి పండుగను అంగరంగ వైభావంగా జరుపుకుంటున్నరు.
గణనాథులు అన్ని మండపాలలో కొలువై పూజలందుకున్నాయి. ఇట్టి పండుగను హిందువులు భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.
హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాథుడు కే చేస్తారు. పార్వతీ తనయుడు అనుగ్రహాం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం. భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని, గణాధిపత్యం వచ్చిందనే పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, విఘ్నాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. ఈ వినాాయక చవితి పండుగను కుల మతా, బేధాలు లేకుండా ఏమీ లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండుగ.
“వినాయక చవితి హిందువులకు తొలి పండుగ. ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే వినాయకుడి జననం జరిగిందని కొందరు.. గణాధిపత్యం వచ్చిందని కొన్ని పౌరాణిక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. విఘ్నేశ్వరుడి పుట్టిన రోజు లేదా గణాధిపత్యం పొందిన భాద్రపద శుద్ధ చవిని ‘వినాయక చవితి’ పండుగను హిందువులు జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని.. గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. వినాయక చవితి రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికి వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించి, దీపారాధన చేయాలి.
ఇట్టి కార్యక్రమం లో మాజీ సర్పంచ్ దేవయి సాగర్, నవీన్ గౌడ్, శరత్ గంగపుత్ర కుల సభ్యులు మరియు స్టార్ యూత్ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.