నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ఆర్మూర్ నందు డిగ్రీ విద్యార్థినులు మట్టి గణపతి విగ్రహాలను తయారు చేసారని ప్రిన్సిపాల్ G. ధనవేణి తెలిపారు. ప్రజలలో పర్యావరణ పరిరక్ష పట్ల అవగాహన కల్పించడానికి విద్యార్థినులు ర్యాలి.
నిర్వహించారు. విద్యార్థినులు తయారుచేసిన గణపతి ప్రతిమలను ఆర్మూర్ మున్సిపల్ ఛైర్మన్ పండిట్ వినీత, మున్సిపల్ కౌన్సిలర్ వరలక్ష్మి లకు అందజేశారు. కళాశాల దగ్గరలో ఉన్న కొన్ని కుటుంబాల వారికి మట్టి గణపతులను అందజేశారు. మట్టిగణపతులను వాడాలని పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు, విద్యార్థినుల సృజనాత్మకతను, పర్యావరణం పట్ల విద్యార్థినులకు ఉన్న ప్రజలకు చేరవేసినందుకు అవగాహన ప్రిన్సిపాల్ విద్యార్థినులను అభినందించారు. ర్యాలిలో విద్యార్థినులతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు.