A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో సీపీ సాయి చైతన్య పత్రిక సమావేశం నిర్వహించారు. సిపి మాట్లాడుతూ.. వాహన తనిఖీలలో ఐదుగురు చైన్ స్నాచర్స్ నిందితులని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 18లక్షల రూపాయల విలువచేసే బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. ఐదుగురి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
