A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ మర్కజ్ కమిటీ నూతన అధ్యక్షుడు అబ్దుల్ అజీమ్, కార్యదర్శి మున్షీ, ఉపాధ్యక్షుడు ఆసిఫ్, కార్యవర్గం సభ్యులు తహసీల్దార్ సత్యనారాయణను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ సమస్యలను ఎమ్మార్వో దృష్టికి తీసుకు వెళ్ళామన్నారు. సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని కోరారు. దీనిపై ఎమ్మార్వో సానుకూలంగా స్పందించారని చెప్పుకొచ్చారు.
